NTR’s master plan.. Hrithik enters the field for ‘Devara’: జూ. ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సినిమా ‘దేవర’. రేపు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇవాళే ముంబై చేరుకున్నారు. రేపు ముంబైలో మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ ప్రచారానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. కొత్త సినిమా రిలీజ్ పెట్టుకున్నోళ్లు ఎవరైనా తమ పరిచయాలన్నింటినీ బయటకు తీయడం సహజమే. తమ సినిమాకు మ్యాగ్జిమమ్ ప్రచారం కల్పించాలని చూస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
‘దేవర’ సినిమాను బాలీవుడ్‌లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో, దేవర-1తో తన క్రేజ్‌ను మరింత పెంచుకోవాలని చూస్తున్నారు తారక్. దీని కోసం బాలీవుడ్‌లో తన పరిచయాలన్నింటినీ వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ తో ఈ మూవీని ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్-హృతిక్ కలిసి వార్-2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పరిచయాన్ని ‘దేవర’ కోసం కూడా ఉపయోగించుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. అంతేకాదు, కరణ్ జోహార్, అలియా భట్, సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్లతోనూ ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న ‘దేవర’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.