Trending Now

మైనార్టీ కార్పొరేషన్​ చైర్మన్​గా కొత్వాల్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేష‌న్ చైర్మన్​గా మహబూబ్​నగర్​కు చెందిన సీనియర్​ నేత ఒబెదుల్లా కొత్వాల్ గురువారం హ‌జ్ హౌస్ లో బాధ్యత‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ఱారావు ఒబెదుల్లాకు పుష్పంగుచ్చం అంద‌జేసి ,శాలువాతో స‌త్కరించారు. అలాగే షాద్​నగర్​ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్​రెడ్డితో టీపీసీసీ సీనియర్​ నేత బాబర్​ అలీఖాన్​తో పాటు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్​ నేతలు ఒబేదుల్లా కొత్వాల్​ను సన్మానించి, అభినందనలు తెలిపారు.

Spread the love

Related News

Latest News