యువ ఓటర్లను ఆకర్షించేలా శోభామానంగా అలంకరణ.. డప్పులతో స్వాగతం..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 13 : కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సలహాలతో నిర్మల్ జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాలలో యువ ఓటర్లు, మహిళ ఓటర్లు, అంగవైకల్యం గల ఓటర్లు ఇలా పలు రంగాలలో విభజించి ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా వందశాతం పోలింగ్ నమోదు చేయడమే లక్ష్యంగా మండుటెండలలో అధికారులు సిబ్బంది పడుతున్న కష్టాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
ముఖ్యంగా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామంలో అత్యధికంగా యువ ఓటర్లు ఉండడంతో వారిని పోలింగ్ స్టేషన్ లోకి డప్పులతో ఘన స్వాగతం పలికి వారు ఓటు సద్వినియోగ పరచుకునేలా ప్రోత్సహించారు. అదేవిధంగా నిర్మల్ పట్టణంలోని మౌలానా ఆజాద్ నగర్( ఈద్గాం)లో ఉన్న పోలీంగ్ స్టేషన్ ను మోడల్ పోలీస్ స్టేషన్ గా మామిడి తోరణాలు పచ్చని కార్పెట్ లతో శోభాయమానంగా అలంకరించారు. ఈ ఒక్క పోలింగ్ స్టేషన్ లోనే మహిళా ఓటర్లు మొత్తం 739 ఉండడంతో దీనికి మహిళా మోడల్ పోలింగ్ స్టేషన్ గా తీర్చిదిద్దారు.