విధుల్లో ఉన్న మా ఓట్ల సంగతేంటి సారూ..
ప్రతిపక్షం, షాద్ నగర్, మే 06: ఈనెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎన్నికల విధుల్లో భాగంగా డ్యూటీలు వేశారు. ఇంతవరకు బాగానే వుంది కాని విధుల్లో వున్నఆ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లో ఓటు వేసుకోవడానికి ఏర్పాటు
మాత్రం మరిచారు. నిర్లక్ష్యం ఎవరిదైనా తమ ఓటును మాత్రం వినియోగించుకోలేక పోతున్నామని ఉద్యోగులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తంతు కొనసాగిందని, మళ్ళీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న తమకు, మరి కొంతమంది ఉద్యోగులకు అదే అనుభవం పునరావృతం అయిందని ఉపాధ్యాయులు శివారెడ్డి, బిజిలి సత్యంలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల ఆర్డర్ కాపీ తో పాటు పోస్టల్ బ్యాలెట్ ది కూడా అందిస్తే బాగుంటుందని వారు అన్నారు. రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కుని వినయోగించుకోకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు.