అదనపు కలెక్టర్ గరిమా అగ్రర్వాల్..
ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి మార్చి 30: చాలా మంది అధికారులు ఇదివరకు ఎలక్షన్ విధులు చేశామని నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి సారి ఈసీఐ కొత్త కొత్త మార్గదర్శకాలు రుపోందిస్తుందని అదనపు కలెక్టర్ గరిమా అగ్రర్వాల్ తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ అసెంబ్లీ నియోజకవర్గ వర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్, దుబ్బాక ఎఆర్వో గరిమా అగ్రవాల్ హజరయ్యారు. మీకు అందజేయబడిన పిపిటి – హండ్ బుక్ నీ పూర్తిగా చదివి అర్థం చేసుకోని బుక్ ని ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవాలి. ఈవీఎం మిషన్లలో బాలెట్ యూనిట్, వివి ప్యాడ్, కంట్రోల్ యునిట్ అనుసందాన ప్రక్రియ మరియు పోలింగ్ డే రోజు మాక్ పోల్ ప్రక్రియ ముఖ్యంగా పలు పత్రాలు నింపే విధానం గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, డిపిఓ దేవకీ దేవి తదితరులు పాల్గొన్నారు.