ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తనను కలుసుకోవటానికి వచ్చే నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు హోం మంత్రి అనిత కీలక విజ్ఞప్తి చేశారు. తన కోసం బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని.. డబ్బు వృథా చేయోద్దని కోరారు. బొకేలు, శాలువాల కోసం వెచ్చించే డబ్బును అమరావతి అభివృద్ధికి సాయం చేయాలన్నారు. అదే తనకు ఇచ్చే గొప్ప అభినందన, గౌరవం అని తెలిపారు. ఈ మేరకు ‘అమరావతి నిర్మాణానికి ఈ ఒక్క అడుగు’ అని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేశారు.