Trending Now

తల్లిదండ్రులు తొలి గురువులు..

కన్నుల పండుగ తల్లిదండ్రుల పాద పూజోత్సవం

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 02: సిద్దిపేట వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం చంద్రమౌళి గార్డెన్‌లో తల్లిదండ్రుల పాద పూజోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య తమ బిడ్డలు పాదాలకు పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకోవడం తల్లిదండ్రులను పులకింపజేసింది. బాల సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా సనాతన సంస్కృతిని ప్రతిష్టించే క్రమంలో మహోత్సవాన్ని నిర్వహించారు. పిల్లలు తల్లిదండ్రుల పాదాలను కడిగి, పూజలు నిర్వహించి నమస్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సామాజిక సమరస వేదిక రాష్ట్ర సారధి అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య సంస్కృతి వల్ల నైతిక విలువలు పతనమవుతున్నాయని, మనుషుల మధ్య దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాహకులు ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి చక్కటి సందేశాన్ని ఇవ్వడం మంచిదని అభినందించారు. గురు, తల్లిదండ్రుల, దేశ, ఆధ్యాత్మిక, దైవ భక్తి వర్ధిల్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ డాక్టర్ అరవింద్, అధ్యక్షులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోట అశోక్, సీనియర్ జర్నలిస్ట్ కే .అంజయ్య, యోగా శిక్షకులు తోట సతీష్, సంధ్య లు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పిల్లలకు ఉత్తమ సంస్కారాన్ని అందించడంతోపాటు వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శిబిరం విజయవంతంగా నడుస్తుందని చెప్పారు. ప్రత్యక్ష దేవులైన తల్లిదండ్రులను పూజించడం, ప్రేమించడం పిల్లలవికాసానికి తోడ్పడుతుందని తెలిపారు. దాదాపు 300 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో బసవ రాజ్ కుమార్, కూరెళ్ళ రవి, అనిల్, యాదగిరి, విజయలక్ష్మి, పల్లె సురేష్, సాయి తేజ, మనీషా సింధూరి, పూజ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News