Pakistan Team: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. డబ్ల్యూటీసీ ఫైనల్ కష్టమే!

Can Pakistan still qualify for WTC Final: పాకిస్తాన్‌ను సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఓడించింది. ఇరు దేశాల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 0-2తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం పాక్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది.

ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మెదటి టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30శాతం కోతతోపాటు ఆరు పాయింట్లు కట్ చేసినట్లు ఐసీసీ పేర్కొంది.

పాకిస్తాన్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం కష్టంగా మారింది. మరోవైపు బంగ్లాదేశ్‌కు కూడా స్లో ఓవర్ రేటు తగిలింది. దీంతో డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాదేశ్ ఏడు, పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. రానున్న మ్యాచ్‌ల్లో విజయం సాధించినా ఆ జట్టు టాప్ 2 లోకి చేరడం కష్టమేనని అంటున్నారు. దీంతో ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లేనని విశ్లేషకులు అంటున్నారు.

Spread the love

Related News