ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బడుగు, బలహీన వర్గాలందరికీ న్యాయ సహాయం అందించేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’ ప్రారంభించడం అభినందనీయమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె నాగేశ్వరరావు అన్నారు. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) ఆధ్వర్యంలో ఆదివారం మెహదీపట్నంలో లీగల్ ఎయిడ్ క్లినిక్, లా లైబ్రరీని ఆయన ప్రారంభించారు. తమ సంస్థ దేశ వ్యాప్తంగా ఉచిత న్యాయసేవలను అందిస్తోందని ఏపీసీఆర్ వైస్ ప్రెసిడెంట్ అఫ్సర్ జహాన్ వెల్లడించారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది సుమైరా నాసర్ రసూల్ ఖాన్, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిమ్మనారాయణ తదితరులు పాల్గొన్నారు.