ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 12: తాటి ఈత వనం దగ్ధమైన ఘటన హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పొట్లపల్లి వెళ్లే దారిలో గల హుస్నాబాద్ పట్టణ కల్లు గీత కార్మిక సంఘానికి చెందిన తాటి ఈత వనంలో దాదాపు ఇరవై ఏళ్ల వయసున్న వేయ్యి వరకు చెట్లు.. పక్కనే ఉన్నసరిహద్దు రైతులు నిప్పంటించడం వల్ల తాటి ఈత వనం మొత్తం ఖాళీపోయి దగ్ధమైంది. గీతా కార్మికులకు న్యాయం చేయాలని.. తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్ డిమాండ్ చేశారు. బీఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి, రంగు సంపత్ గౌడ్, దగ్ధమైన తాటి, ఈత వనాన్నిసందర్శించి గీతా కార్మికులకు వారి సొంత భూమికి ఫెన్సింగ్ చేసుకోనుట కొరకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు.
దగ్ధమైన స్థలంలో తాటి, ఈత ఖర్జూర,గిరక, జీలుగా విత్తనాలు ఇచ్చి స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా దగ్ధం చేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు ఎలగందుల శంకర్ మాట్లాడుతూ.. గీతా కార్మికుల జీవనోపాధి దెబ్బతిన్నందున స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రాజు గౌడ, సంఘం నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, కోయిడ శ్రీనివాస్ గౌడ్, పాకాల సమ్మయ్య గౌడ్, పచ్చిమట్ల పెద్ద రవి, పూదరి శ్రీనివాస్, పూదరి రవీందర్ గౌడ్, పూదరి కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.