ప్రతిపక్షం, నేషనల్: తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం రేపింది. రాష్ట్రంలోని రెండు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కోయంబత్తూర్‌లోని పీఎన్‌బీబీ మిలీనియం స్కూల్, కాంచీపురం జిల్లాలోని ఒక ప్రయివేటు పాఠశాలకు బెదిరింపులు వచ్చాయి. పీఎన్‌బీబీ స్కూల్‌కు ఆదివారం రాత్రి ఓ ఈ మెయిల్ రాగా.. సోమవారం మరో ప్రయివేటు పాఠశాలకు బెదిరింపు సందేశాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న బాంబ్ స్వ్కాడ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది.
రెండు పాఠశాలల్లో తనిఖీలు చేపట్టింది. స్కూల్ పరిసరాల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో వార్నింగ్స్ పేక్ అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున ఈ బెదిరింపులు రావడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే మెయిల్స్ ఎవరు పంపారు అనే విషయం వెల్లడించలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.