Trending Now

Para Olympics: నేటి నుంచి పారా ఒలింపిక్స్

Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్ క్రీడలకు ముస్తాబైంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ క్రీడలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దాదాపు 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ క్రీడలు దివ్యాంగుల కోసం జరగనున్నాయి. ఈ మేరకు 168 దేశాల నుంచి మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఇక, భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. అంతకుముందు 2020లో టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు.. 5 స్వర్ణాలతోపాటు 19 పతకాలు సాధించారు.

Spread the love

Related News

Latest News