పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో షూటర్ అవనీ లేఖరా బంగారు పతకం సాధించింది. దీంతో రెండో రోజు పతకాల జాబితాలో భారత్ ఖాతా తెరిచినట్లయింది. 249.7 పాయింట్లతో సమీప ప్రత్యర్థి లీ (సౌత్ కొరియా)పై అవనీ లేఖరా విజయాన్ని అందుకుంది. 246.8 పాయింట్లతో లీ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకాన్ని సాధించింది. ఇక, ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మరో క్రీడాకారిణి మోనా అగర్వాల్ కూడా సత్తా చాటింది. మూడో స్థానంలో నిలిచిన మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని అందుకుంది. ఒక్క 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లోనే భారత్‌కు రెండు పతకాలు సొంతం కావడం పట్ల అందరూ ప్రశంసిస్తున్నారు.