Rubina Francis wins bronze in Paralympics: పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ మరో పతకం సాధించింది. మహిళా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్‌లో భారత్‌కు చెందిన రుబీనా ఫ్రాన్సిస్..211.1 స్కోరుతో పతకం సాధించింది. పిస్టల్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారత పారా షూటర్ అథ్లెట్‌గా రుబీనా రికార్డు సాధించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు వివిధ విభాగాల్లో ఐదు పతకాలు సాధించింది. శుక్రవారం భారత్ నాలుగు పతకాలు సాధించింది. ఇందులో షూటింగ్‌లో అవని లేఖరా స్వర్ణం సాధించగా..మనీశ్ నర్వాల్ రజతం, మోనా అగర్వాల్ కాంస్య పతకాలు సాధించారు. మహిళల 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంస్యం గెలుచుకుంది.