Para-Badminton Women’s Singles: పారిస్ పారాలింపిక్స్‌లో భారత మహిళలు అదరగొడుతున్నారు. తాజాగా, జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో రెండు పతకాలు వరించాయి. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురుగేశన్ రజత పతకాన్ని గెలుచుకుంది. అదే విభాగంలో మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్‌కు మొత్తం 11 పతకాలు వరించాయి.
కాగా, ఫైనల్‌లో తులసిమతి మురుగేశన్ చైనాకు చెందిన యాంగ్ క్విజియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో 17-21, 10 -21 తేడాతో మురుగేశన్ ఓడింది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకుంది. అలాగే, కాంస్య పతక పోరులో మనీషా.. 21-12, 21 -8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్ గ్రెన్‌ను ఓడించింది.