పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56లో యోగేశ్ కతునియా (42.22 మీటర్లు) రజతం దక్కించుకున్నాడు. బ్రెజిల్‌కు చెందిన క్లాడినీ బాటిస్టా (46.86 మీ) స్వర్ణం అందుకున్నాడు. గ్రీస్ దేశానికి చెందిన కాన్స్టాంటినోస్ జౌనిస్ (41.32 మీ) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. తాజా పతకంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా.. యోగేశ్ కతునియా టోక్యో పారాలింపిక్స్‌లోనూ రజత పతకం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.