ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. అగిరిపల్లి మండలం, నెక్కలం గొల్లగూడెం సెంటర్ లో చేరుకున్న ఆమెకు నూజివీడు నియోజకవర్గ ఇంచార్జి కొలుసు పార్థసారధి ఘన స్వాగతం పలికారు. తనకు సంఘీభావం, స్వాగతం పలికేందుకు వచ్చిన వారికి భువనేశ్వరి అభివాదం చేశారు. అనంతరం ఆమె అగిరిపల్లి మండటంలో తోటపల్లి గ్రామానికి బయలుదేరారు.