ప్రతిపక్షం, ఎల్బీనగర్, ఏప్రిల్ 22: మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ వేయుచున్న శుభ సందర్భంగా నిర్వహించుచున్న బహిరంగ సభకు ఎల్ బీ నగర్ నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యాలయం వద్ద నుండి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆధ్వర్యంలో వేలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా తరలివెళ్లిన వారిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, యస్ వి కృష్ణ ప్రసాద్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మిద్దెల జితేందర్, సామ రమణా రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్, మల్లారపు శాలిని, బద్దుల వెంకటేష్ యాదవ్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్,మంజుల రెడ్డి, లింగాల కిషోర్ గౌడ్, కత్తుల రాంబాబు, వెంకట కృష్ణ, రాజు గౌడ్, పురుషోత్తం, శ్రీధర్ గౌడ్, వట్టెపు యాదయ్య, జోగు రాములు, కోటగిరి ఉషారాణి, సరస్వతి, అనసూయ గౌడ్, చరణ్, రాజశేఖర్, ఆశోక్ గౌడ్ తదితరులున్నారు.