Pawan Kalyan huge donation to the flood victims: వరద బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వరద తీవ్రత, సహాయక చర్యలపై విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆర్మీ సహకారంతో బాధితులకు సహాయం అందిస్తున్నామని, బుడమేరు నిర్వహణ సక్రమంగా లేక వరద పోటెత్తిందన్నారు.
అయితే, తను కనిపించడం లేదని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించారు. నేను పర్యటించాలని అనుకున్నానని, నా వల్ల సహాాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదన్నారు. నా పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్పా అదనపు భారం కాకూడదన్నారు. నేను రాలేదని కొంతమంది నిందలు వేస్తారని, అంతే తప్పా ఇంకేం ఉండదన్నారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజా సేవ చేయడమే ముఖ్యమని పవన్ వెల్లడించారు.