ప్రతిపక్షం, ఏపీ: భీమవరంలో కార్యకర్తల సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవ్వవని, నేను ఎప్పుడూ డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని చెప్పలేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనని.. నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేని అన్నారు.
ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టమని అభ్యర్థులను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికైతే అందరం ఇలాంటి అబద్ధపు లోకంలోకే బతుకున్నామని, భవిష్యత్ లోనైనా ఇలాంటి రాజకీయాలు మారితే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.