ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం CM చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు.
పవన్ కళ్యాణ్‌కు Y ప్లస్ సెక్యూరిటీ..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా,ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.