Trending Now

Pavan: శ్రావణమాసం చివరి శుక్రవారం.. ఆడపడుచులకు పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక కానుక

ఇవాళ శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. అయితే ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు అందజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్‌ కళ్యాణ్ పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారుచేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం రెండు రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్‌కళ్యాణ్ నివాసంలో జరుగుతోంది. ఇక శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా ఆరువేల మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని పాదగయ ఈఓ దుర్గాభవాని తెలిపారు.

Spread the love

Related News

Latest News