ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లో కొత్తగా నిర్మించిన ముల్లన్‌పూర్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ఆతిథ్య పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డిసెంబరు 2022లో ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరోవైపు.. పంజాబ్ శిఖర్ ధావన్ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. తాజా ఎడిషన్‌ను గెలుపుతో ఆరంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.
పంజాబ్ కింగ్స్:
శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ( వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.