ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసే కీలక దశకు చేరుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో అడుగున ఉన్న జట్లు ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇందులో భాగంగా 8వ స్థానంలో ఉన్న పంజాబ్, 9వ స్థానంలోని ముంబైతో నేడు తలపడనుంది. ఇరు జట్లూ ఆరేసి మ్యాచులు ఆడి 2 గెలిచాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. హెడ్ టు హెడ్ రికార్డు 16-15 ముంబై వైపే ఉంది.
చరిత్ర సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్..
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతి పెద్ద విజయం. అంతకుముందు 2022లో పంజాబ్ కింగ్స్‌పై 57 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అలాగే ఈ సీజన్‌లో బంతులపరంగా అతి పెద్ద విజయంగా ఢిల్లీ రికార్డు నమోదు చేసింది.
గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు..
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ తమ అత్యల్ప స్కోరు నమోదు చేసి అప్రతిష్ఠపాలైంది. ఇంతకుముందు గుజరాత్ అత్యల్పస్కోరు 125/6గా ఉంది. కాగా ఆ జట్టు 100 పరుగులలోపు ఆలౌట్ కావడం కూడా ఇదే తొలిసారి.