Trending Now

‘ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి’

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వాగ్మారే మహేందర్ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పుస్తకాలు, యూనిఫాం, బూట్లు ,టై లు అమ్ముతు అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కూడా డి.ఈ.వో రవీందర్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం విచ్చల విడిగా ఫీజులు పెంచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాబట్టి వీటి నియంత్రణ కోసం తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఒకపక్క ప్రైవేట్, కార్పోరేట్ యాజమాన్యాలు ఇప్పుడే ప్రచార క్యాంపేయిన్ చేస్తూ ముందస్తు అడ్మిషన్లు చేసుకున్నారని, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజులు ఆలస్యంగా ప్రచార క్యాంపేయిన్ (బడిబాట) ప్రారంభం కావడం సిగ్గుచేటని అన్నారు. అలాగే శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మత్తులు చేయించి కనీస సౌకర్యాలను ఏర్పరచాలని ఆయన కోరారు.

Spread the love

Related News

Latest News