Trending Now

నెలలు నిండని శిశువుకు ప్రాణం పోసిన డాక్టర్..

కంగారు కేర్ చికిత్సతో బిడ్డ ఎదుగుదల..

ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి, నిర్మల్, జూన్ 8 : నెలలు నిండని శిశువులను సంరక్షించు కునేందుకు నూతన మార్గాలను అన్వేషిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు నిర్మల్ జిల్లా బైంసా పట్టణ వైద్యులు. అందులో భాగంగానే జి. డి.ఆర్. ఆసుపత్రి పిల్లల వైద్య నిపుణులు డా. అనిల్ కుమార్ కంగారు కేర్ చికిత్స ద్వారా నెలలు నిండని శిశువును 25 రోజుల పాటు చికిత్స చేసి సంరక్షిస్తున్నారు. దీంతో శిశువుల కుటుంబ సభ్యులు డా. అనిల్ కుమార్ కు కు కృతఙ్ఞతలు చెబుతు ఆనందం వ్యక్తం చేశారు. భైంసా మండలం లోని సిరాల గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే గర్భిణీకి 8 మాసాలకే పురిటి నొప్పులు రావడం తో ఆసుపత్రికి తీసుకువచ్చారు. కండిషన్ సీరియస్ గా ఉండడం తో అ తల్లికి 9 నెలలు నిండా కుండానే ఆడ శిశువు ను జన్మనిచ్చింది.

నవ మాసాలు నిండలేదు. కేవలం 1200 గ్రాముల బిడ్డను రక్షించుకోవడం కష్టమేమని తెలుసుకొని ఆందోళనతో ఆ గమ్య గోచరులై వారు వాపోతూ ఇక తమ బిడ్డను ఎలాగైనా కాపాడాలని కుటుంబ సభ్యులతో డా.అనిల్ కుమార్ పాదయా పడుతూ కన్నీరు మున్నూరు అయ్యారు దీంతో వెంటనే అప్రమత్తమై వైద్య చికిత్సలు అందించేందుకు డాక్టర్ అనిల్ కుమార్ తనదైన రీతిలో సిద్ధమయ్యారు.కంగారు కేర్ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతి రోజు ఎన్. ఐ సి యూ లో శిశువును ఉంచుతూ రోజుకు రెండు గంటల పాటు తల్లి బిడ్డను కలిపారు. తల్లి ఎడమ భాగం లో శిశువును ఉంచి తల్లి బిడ్డల చర్మ తాకిడి తగిలేలా చేశారు.. ఈ విధానాన్నే కంగారు కేర్ అంటారు. కంగారు జంతువు తన శిశువుని ఎలా రక్షించుకుంటుందో అదే విధానం లో చికిత్స చేశారు. బిడ్డ పుట్టిన పది రోజుల పాటు శ్వాసకోస ఇబ్బందులు ఉండడం తో అక్సిజన్ థెరఫీ చేసి కాపాడారు. ట్యూబ్ ద్వారా బిడ్డకు పాలనుఅందించి కంటికి రెప్పలా కాపాడారు. 25 రోజుల పాటు చికిత్స చేయడం తో బిడ్డ కొంత బరువు పెరిగి ఆరోగ్యంగా ఉండడం తో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.డా. అనిల్ కుమార్ ఈ తరహ సాహసం చేయకపొతే అ శిశువును ఇతర ప్రాంతాలకు తరలించి చికిత్స నిర్వహిస్తే 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యేది. అతి తక్కువ ఖర్చుతో తమ బిడ్డకు ట్రీట్మెంట్ చేశారని శిశువు తల్లితండ్రులు ఓం ప్రకాష్, రాజేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. కంగారు కేర్ చికిత్స నిర్వహించి శిశువును సంరక్షించినందుకు డా. అనిల్ కుమార్ కు పలువురు అభినందనలు తెలిపారు.

Spread the love

Related News

Latest News