Trending Now

ప్రభుత్వ పాఠశాలలో పెండింగ్ పనులను పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 07: అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనులను ఈనెల 20వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీర్లు మరియు విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద జిల్లాలో 814 పాఠశాలలలో విద్యుత్, తరగతి గదులు, మరుగుదొడ్లు, కిషన్ షెడ్లు మరియు ప్రహరీ గోడల మరమత్తు పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కావడానికి ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉన్నా ఇప్పటికీ 176 పాఠశాలలలో నిర్మాణ పనులు పూర్తయి మిగతా పాఠశాలలలో చేపట్టిన పనులు కాకపోవడంపై పంచాయతీరాజ్ మరియు ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేసి నిర్మాణం చివరి దశలో ఉన్న పాఠశాలలలో రంగులు పూర్తిచేసి 12 లోగా అందించాలని అలాగే మిగతా పాఠశాలలో ఈనెల 20వ తేదీలోగా 100% పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.

32 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా ఇప్పటికీ 8 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగిందని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పనులు చేపట్టి నిర్మాణ ప్రగతి సరిగా లేని పాఠశాలలను మరియు అసలే పనులు ప్రారంభించని పాఠశాలలను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారితో కలిసి సందర్శించి త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. సోమవారం అన్ని మండలాల్లో ఎంపీడీవోలు, ఎంఈఓ లు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఐకెపి వివోలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇఇలు, డిఇలు, ఎఇలు, ఈడబ్ల్యూఐడిసి ఇఇ, విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News