ప్రతిపక్షం, హైదరాబాద్ : సింగరేణిలో 485 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 317 ఖాళీలను నేరుగా, 168 ఖాళీలను అంతర్గత విధానంలో భర్తీ చేసేలా నోటిఫికేషన్ నామినేషన్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకాల కింద మరో వెయ్యి ఖాళీలు భర్తీ చేయాలని సూచించారు. కొత్తగూడెంలో నిర్మితమైన 10.5 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ ఈ నెల 26న ప్రారంభమవుతుందన ఆయన తెలిపారు. సింగరేణి సంస్థ తరఫున హైదరాబాద్ లో అతిథి గృహం నిర్మిస్తామనవ ఆయన తెలిపారు.