ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాష్ట్ర రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతు.. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని, మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లించాలని వినతి పత్రంలో కోరారు.