పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ఊహించని ఘటన జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో ఇద్దరు అధికారులు గొడవ పెట్టుకున్నారు. పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్‌ల మధ్య వివాదం జరిగింది. అది కాస్త వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది. దీంతో ఇద్దరూ కొట్టుకున్నారు. కౌన్సిల్ సభ్యులు ఉన్నారని కూడా చూడకుండా.. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.