వెనెజువెలాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. టాచిరాలోని పరమిల్లో ఎయిర్‌పోర్ట్‌లో చిన్న ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయ్యింది. విమానం రన్‌వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.