ప్రతిపక్షం, హైదరాబాద్: తెలంగాణ నిఘా విభాగంలోని స్పెషల్ ఇంటిలిజెన్స్ విభాగం (ఎస్బీఐ) లో ఆధారాలు ధ్వసం కేసులో ప్రధాన నిందితుడు, అప్పటి డీఎస్పీ ప్రణీత్ కుమార్ నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ సంచలన కేసులో ఆయన మొన్న రాత్రి సిరిసిల్లలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలించి విచారించామని, ఇతరులతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆయన ఒప్పుకున్నాడని పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు, 42 హార్డ్ డిస్కులు తొలగించడం లేదా ధ్వంసం చేయడంతోపాటు వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చినట్లు గుర్తించారు. అలాగే జనరేటర్ సమీపంలో పలు కీలక పత్రాల్ని కాల్చివేసినట్లు సమాచారం సేకరించారు.