Trending Now

విద్యారంగ డిమాండ్లను రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో చేర్చాలి..

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి ప్రొఫెసర్ కే లక్ష్మినారాయణ..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ),ఏప్రిల్ 5: ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలలో పీపుల్స్ మేనిఫెస్టోలోని విద్యారంగా డిమాండ్లను చేర్చాలని కోరుతూ.. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్ లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఫాసిస్టు, కార్పొరేట్ ఏజెండాను ముందుకు తీసుకు వెళ్లేందుకు నూతన విద్యా విధానం 2020, ప్రైవేట్ సంస్థలకు పూర్తిగా స్వేచ్ఛనిస్తూ.. తమ విద్యను ప్రోత్సహిస్తూ విద్యా రంగంలో వ్యాపారీకరణ, కాషాయీకరణలను వేగవంతం చేయడానికి ఈ విధానాలు తీసుకొచ్చారని విమర్శించారు. అలాగే చారిత్రాత్మకంగా వివక్షకు గురైన అణిచివేయబడిన వర్గాలు అనుభవిస్తున్నరిజర్వేషన్లను తీసివేయడానికి ఇప్పుడు అమలులో ఉన్న సీనియారిటీ నియమాలను ఉల్లంఘించడానికి ఈ విధానాలు తోడ్పడేలా ఉన్నాయని భావించారు. అఖిల భారత విద్యా హక్కు వేదిక, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలు పేర్కొన్న పీపుల్స్ మేనిఫెస్టోలోని కొన్ని డిమాండ్లను వివరించారు.

డిమాండ్స్:

*నూతన విద్యా విధానం 20220, జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రైమ్ వర్క్ 2003 లను రద్దు చేయాలి.
*కేంద్ర బడ్జెట్లో కనీసం 15% విద్యకు కేటాయించాలి.
*విద్య వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణను, హిందుత్వీకరణను వెంటనే ఆపివేయాలి
*జ్యోతిష్యం ,భూత వైద్యం, వంటి అశాస్త్రయ కోర్సులను ప్రవేశపెట్టడం మానుకోవాలి.
*విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను ఎత్తివేసి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి అలాగే ప్రమోషన్లలో సీనియారిటీ విధానాన్ని తీసేసే విధానాన్ని కూడా మానుకోవాలి.

ఈ సమావేశంలో సామాజిక కార్యకర్త నిర్మల,డి.టి.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ చారి, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు మహేందర్, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు కిరణ్, నాయకులు రాజారాం, ఆదివాసీ, గిరిజన సంఘం నాయకుడు భీమ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News