Trending Now

BREAKING: మర్డర్ కేసులో ‘పోకిరి’ రీమేక్ హీరో అరెస్ట్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో దర్శన్‌ను మైసూరు ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు. అతడిని బెంగళూరుకు తీసుకొస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దర్శన్ కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘పోకిరి’ని రీమేక్‌ చేశారు.

గతంలో ఆయన పవిత్ర గౌడను పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. వారి ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ క్రమంలో పవిత్ర గౌడకు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్యకర సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. జూన్ 8న రేణుకా స్వామి హత్యకు గురయ్యాడు. హీరో దర్శన్ సూచనతోనే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Spread the love

Related News

Latest News