Pothula Sunitha Resigns To YCP Party: ఏపీలో వైసీపీ వరుస షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మంగళవారం ఏలూరు మేయర్ నూర్జహాన్ టీడీపీలో చేరారు. తాజాగా, వైసీపీకి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ అధినేత జగన్‌కు లేఖ పంపారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ పోతుల సునీతను టీడీపీలోకి చేర్చుకోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష్ అధిష్టానానికి రిక్వెస్ట్ చేశారు. ‘దయచేసి ఊసరవెళ్లి లాంటఇ నాయకులను మన పార్టీలొకి తీసుకొవద్దు. అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్లను పార్టీలో చేర్చుకుంటే.. అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్లను అవమానించినట్లే అవుతుంది.’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.