ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 31 : జూన్ 2, 3, తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రం లో,త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్లోజరుగు, ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కే. లక్ష్మి తెలిపారు. ఈ క్లాసులకు నిర్మల్ జిల్లా నుండి 15 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మి తెలిపారు. ఈ మహిళా సంఘం శిక్షణ తరగతులలో మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారులపై మూఢ నమ్మకాలపై ప్రైవేట్ రంగంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని మహిళా హక్కులను కాపాడాలని కోరారు.
మహిళ లపై రోజురోజుకు దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అదుపు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా, అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఇన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కొంతమంది మనువాద సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ మహిళలను ఇంటికే పరిమితం కావాలని మహిళలను బందీలుగానే చూడాలని కొన్ని మనువాద పాలకవర్గ పార్టీలు కోరుకుంటున్నాయని అన్నారు, పాలకవర్గ పార్టీలు కోరుకుంటున్నాయని వాటి స్వభావాలను బట్టబయలు చేయాలని మహిళలను చైతన్య పరచాలని కోరారు.