విచారణకు ‘సై’ అంటే కేసీఆర్ కమీషన్ ముందుకు వెల్లక తప్పదు..?
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలను విద్యుత్ కొనుగోళ్ల కేసు కలవర పెడుతున్నది. నరసింహారెడ్డి కమీషన్ వద్దంటూ గులాబిదళపతి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వేసిన కేసుపై తీర్పు ఏం వస్తుందోనన్న టెన్షన్ కేసుఆర్కు పట్టుకుంది. ఛత్తీస్ గడ్ నుండి విద్యుత్తు కొనుగోళ్ల విచారణపై జస్టిస్ నరసింహారెడ్డి కమీషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. తీర్పసు ఎలా ఉంటుందో నన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో, ముఖ్యంగా కేసీఆర్ పట్టుకుంది. విచారణకు ఒకే అంటూచెబితే ఇక నర్సింహారెడ్డి కమీషన్ ముందు హాజరు కావాల్సిందే! అన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.
విచారణకు హాజరయితే కమీషన్ చైర్మన్ వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని, దీంతో పరువు పోతోందన్న ఆందోళన సైతం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. నర్సింహారెడ్డిని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లడంతో ఆయన విచారణలో ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం లేకపోలేదని, ఆయన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిందేనని, లేకుంటే తప్పులో కాలేసినట్లేనన్నవాదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది. ఏదీ ఏమైనప్పటికి ఈ కమీషన్ వేయడమే కేసీఆర్,బీఆర్ఎస్ పరువు తీసేందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాంలో భాగమేనని కొంత మంది అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ తరపు అడ్వకేట్ వాదనలు వినిపించగా శుక్రవారం ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
జగదీశ్ రెడ్డి అన్న మాటలతోనే..
విద్యుత్తు కొనుగోళ్లపై ఎంక్వయిరీ చేయించుకోమని అసెంబ్లీ వేదికగా సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని, ఎంక్వయిరీ చేయమని వారు అడిగినప్పుడు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అలాంటప్పుడు ఈ కమీషన్ ఏకపక్ష కమీషన్ ఎలా అవుతుందో చెప్పాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. జస్టిస్ నరసింహారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడా కంక్లూజన్ వచ్చినట్టు మాట్లాడలేదని, అంతేకాదు ప్రెస్ మీట్ వీడియోలో కూడా ఎక్కడ ఏకపక్షంగా మాట్లాడలేదన్నారు. అసెంబ్లీ వేదికగా జగదీశ్ రెడ్డి విచారణ చేసుకోవాలని కోరడంతోనే కేసీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తున్నదని, అయితే జగదీశ్ రెడ్డి కేసీఆర్ ను ఇరికించేందుకే ఇలా మాట్లాడారా..? అన్న సందేహాన్ని కొంతమంది బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 27వ తేదీన కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు.
విచారణ ఓపెన్ గానే..
నిబంధనల ప్రకారమే రెండుసార్లు నోటీసులు ఇచ్చామని, విద్యుత్తు కొనుగోలు వ్యవహారంపై పబ్లిక్ నోటీసు సైతం జారీ చేశామని, ఈ వ్యవహారంలో విచారణ మొత్తం ఓపెన్ గానే జరుగుతుందని, ఇప్పటివరకు 15 మంది నుండి వివరాలు సేకరించామని కోర్టుకు తెలిపారు. ఈ 15 మందిలో మాజీ సీఎండి ప్రభాకర్ రావు తో పాటు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఉన్నారన్నారు.
నిబంధనల ప్రకారమే విచారణ..
నిబంధనల ప్రకారమే నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నామని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి ఎవిడెన్స్ ఇవ్వాలని మాత్రమే కోరామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
అంతకుముందు జూన్.
తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..
జూన్ 30న ఎంక్వైరీ కమీషన్ గడువు ముగుస్తుందని, ఈలోగా కమీషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని కాబట్టి కమీషన్ విచారణ పై స్టే ఇవ్వాలని కేసీఆర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో నేడు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. వీలు అయితే శనివారం సాయంత్రం లోగా లేకుంటే జులై 1వ తేదీన కానీ తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది.