ప్రతిపక్షం, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ‘పిఠాపురంలో పోటీ చేయమని కొందరు అడుగుతున్నారు. ఇప్పటికే విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించా.. తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పును తీర్చేస్తా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడుతా’ అని చెప్పుకొచ్చారు.