Trending Now

ఈనెల 10 నుండి కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం..

ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10 నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వలన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని, ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇకనుండి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News