ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ACB సర్పైజ్ చెకింగ్ చేస్తొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లా లతో పాటు పలు జిల్లాలో సర్పైజ్ చెకింగ్స్ కొనసాగుతున్నాయి. రంగారెడ్డి మణికొండ కార్యాలయాలంలో 25 మంది అధికారులతో కొనసాగుతున్న సోదాలు. డీఎస్పీ శ్రీధర్ ఆద్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు సాగుతున్నాయి. పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రైడ్స్ జరగగా.. ముగ్గురిని అదుపులోకి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఫైల్స్‌తో పాటు డబ్బులను ఏసీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓ జూనియర్ అసిస్టెంట్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్ వెస్ట్ జోన్ కార్యాలయంలో విసృత సోదాలు కొనసాగుతున్నాయి.