Trending Now

‘ప్రతిపక్షం’ ఎఫెక్ట్.. అక్రమ ఇసుక రవాణాపై విచారణ

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 30 : నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలోని పలు గ్రామాలలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుండడాన్ని ‘ప్రతిపక్షం’ దినపత్రికలో చాక్ పెల్లిలో ఆగని ఇసుక అక్రమ రవాణా శీర్షికతో ప్రచురితమైన కథనానికి సంబంధిత శాఖల అధికారులు స్పందించారు దీనిపై ఈరోజు విచారణ జరిపారు. గతంలో పట్టుబడ్డ ఇసుక డంపులు రాత్రి పూట వేరే చోటికి ఇసుక అక్రమ రవాణాపై పలు ఫిర్యాదులు అందడంతోతెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతకుమారి రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారుల ఆదేశాలు మేరకు నిర్మల్ జిల్లా మైనింగ్ శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఆనంద్, ఆర్ ఐ సుమలత చాక్ పల్లి గ్రామపంచాయతీలో విచారణ చేపట్టారు.

సహజ వనరుల దోపిడి అక్రమ ఇసుక రవాణా చట్టరీత్యానేరమని ఇసుక రవాణాకు పాల్పడితే ట్రాక్టర్లు సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గృహ నిర్మాణ అవసరాల నిమిత్తం ఇసుక కావాల్సి ఉంటే ఇంటి నిర్మాణ అనుమతి ప్రతులు చూపెట్టి అవసరానికి తగిన ఇసుక రవాణా చేసుకోవాలని కోరారు. ఇంటి నిర్మాణం పేరుతో అక్రమంగా డంపులు చేసి.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సుమలత గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News