ప్రతిపక్షం నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ, జూన్ 1: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఒక పెద్ద బహుమతిని అందించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను శనివారం తగ్గించాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం నుంచి కమర్షియల్ సిలిండర్ ధరను రూ.69.50 మేర తగ్గించాయి. ఢిల్లీలో ధర ఇప్పుడు రూ.69.50 తగ్గి రూ.1676కి చేరుకుంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.72 తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ. 69.50 తగ్గడంతో రూ.1629కి అందుబాటులో ఉంటుంది. చెన్నైలో సిలిండర్ ధర రూ.1840.50కి చేరింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు వరుసగా మూడో నెల తగ్గించబడింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంతకుముందు మే 1న రూ.19, ఏప్రిల్‌లో రూ.30 మేర కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాయి.