ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని కాసేపటి క్రితం దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అర్చకులు మోడీకి అందజేశారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ప్రధాని బేగంపేటకు బయల్దేరారు. బేగంపేట నుంచి సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించనున్నారు. రూ.9,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను మోడీ చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.1,409 కోట్లతో చేపట్టిన హైవేను ప్రధాని ప్రారంభిస్తారు. నాందేడ్-అఖోలా ఎన్‌హెచ్ -161 జాతికి అంకితం చేయనున్నారు.