PM Modi as he Apologises over Shivaji Statue Collapse: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో వాడ్ వణ్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఛత్రపతి శివాజీ అంటే పేరు మాత్రమే కాదని, ఆయన మనందరి దేవుడన్నారు. శివాజీ విగ్రహం కూలడంపై ఆయనకు క్షమాపణలు చెప్పానని, ఈ ఘటనతో బాధకు గురైన వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఛత్రపతి శివాజీని దైవంగా భావిస్తారని, అలాంటి శివాజీ భారీ విగ్రహంపై కూలడంతో తీవ్ర వేదరకు గురయ్యారన్నారు. నా తల వంచి వారికి క్షమాపణలు అంటూ మోదీ మాట్లాడారు. కాగా, గతేడాది డిసెంబర్ 4న ప్రధాని మోదీ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత భారీ వర్షాలకు విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, ఈ విషయంపై అసలు కారణం తెలుసుకునేందుకు నిపుణులు త్వరలో వెల్లడిస్తారని అధికారులు తెలిపారు.