Trending Now

జమ్ముకాశ్మీర్‌ మాజీ గవర్నర్ ఇంట్లో సీబీఐ సోదాలు..

ప్రతిపక్షం, నేషనల్: జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) గురువారం సోదాలు చేపట్టింది. అంతేగాక సత్యపాల్‌కు చెందిన ఢిల్లీలోని సుమారు 30 ప్రాంతాల్లో దాడులు చేశారు. కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ సోదాలు నిర్వహించారు.  ఆయనకు సంబంధించిన 30 ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతంలోని రూ.2,200 కోట్ల విలువైన హైడల్‌ ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లను ఇవ్వడంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపించింది. రెండు హైడల్‌ ప్రాజెక్టుల కోసం రూ. 300 కోట్లు లంచం తీసుకున్నట్లు సిబిఐ పేర్కొంది. సత్యపాల్‌ మాలిక్‌ సహా ఐదుగురిపై 2022 ఏప్రిల్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. తన నివాసాలపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయని, ఈ సోదాల ద్వారా తన డ్రైవర్‌, సహాయకులపై అనవసరంగా వేధిస్తున్నారని సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు. ఈ దాడులకు తాను భయపడనని, రైతుల పక్షాన నిలబడతానని అన్నారు. ఈ చర్యలు తనను అడ్డుకోలేవని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News