Trending Now

ఆర్ కృష్ణయ్యపై దాడిని నిరసిస్తూ నల్ల బ్యాచులతో నిరసన

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆర్ కృష్ణయ్యపై దాడిని నిరసిస్తూ కూకట్ పల్లి వై జంక్షన్ లో రాష్ట్ర బీసీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు నల్ల బ్యాచులతో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కృష్ణయ్య పైన గురువారం రోజు రాత్రి కాళహస్తిలో జరిగిన దాడికి మేమందరం ఖండిస్తున్నాము, దాడి చేసిన వారిని.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం పృథ్వీ గౌడ్, తెలంగాణ బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు బింగి రాములు, మేడ్చల్ జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు డోలక్ నర్సింగరావు, సీనియర్ పాత్రికేయులు లాజర్ ఎమ్మార్పీఎస్, బీసీ సీనియర్ నాయకులు కమలాకర్, సదానంద్ గౌడ్, జోరాపురి అశోక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News