Trending Now

‘పవిత్ర రంజాన్ మాసంలో.. షబే బరాత్ కు సౌకర్యాలు కల్పించండి’

జిల్లా కలెక్టర్ కు ఎంఐఎం నేతల వినతి పత్రం

ప్రతిపక్షం కరీంనగర్ : పవిత్ర షాబాన్ మాసం సందర్భంగా ఈనెల 25న నిర్వహించుకునే షబే బరాత్ జాగ్నేకి రాత్ జాగారానికి సంబంధించి, ముస్లిం స్మశానవాటికలలో వద్ద ఏర్పాట్లు చేయాలని.. కరీంనగర్ ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ కు జిల్లా ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్ఈలకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు. మార్చ్ 11 నుండి ప్రారంభమయ్యే పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని మసీదుల వద్ద, అధికారులు చేయాల్సినటువంటి ఏర్పాట్లపై వినతిపత్రంలో పేర్కోన్నారు.

రంజాన్ నెలలో నగరంలో ముస్లిం కాలనీల్లో, మస్జిద్ లలో త్రాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మసీదుల వద్ద నీటి టాంకర్లను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో నీటి ట్యాంకర్ల కొరత లేకుండా చూడాలని సూచించారు. నగరంలో మసీదుల వద్ద అదనపు క్లీనింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రైనేజి లను శుభ్రపరచాలని, మసీద్ లలో పనిచేస్తున్న ఇమామ్ లకు , మౌజన్ లకు జీతాలు రిలీజ్ చేయాలన్నారు. రంజాన్ నెల కోసం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విధంగా అన్ని మున్సిపల్ ఏరియాలో.. గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరియు డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎమ్ఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు ఖమరుద్దీన్, ఆతిన, కోశాధికారి ఇబ్రహీం, కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్, నాయకులు అలీబాబా, అజర్ దబీర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News