ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : నిర్మల్ గీత పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్యం కోసం నిర్మల్ జిల్లా కలెక్టర్, అబ్కారి సూపరింటెండెంట్ ని కలిసి వినతి పత్రం అందజేసిన గౌడ సంఘం సభ్యులు. నిర్మల్ పట్టణంలోని గౌడ కులస్తులు నిర్మల్ గీత పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వం కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్,జిల్లా అబ్కారి సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. నిర్మల్ గీత పారిశ్రామిక సహకార సంఘంలో కొందరు వ్యక్తులు గత కొన్ని సంవత్సరాల నుండి వారి ఆధీనంలో కల్లు డిపోను పెట్టుకొని వారి కుటుంబ సభ్యులకు మాత్రమే సభ్యత్వం కల్పించి పేద గౌడ కులస్తులకు సభ్యత్వం కల్పించకుండ గత 15 సంవత్సరాల నుండి వేదిస్తున్నారని ఫిర్యాదుల పేర్కొన్నారు.
ఈ విషయమై గతంలో హైకోర్ట్ ను పేద గౌడ కులస్తులు సంప్రదించగా వారికీ సభ్యత్వం కల్పించాలని హై కోర్ట్ ఆదేశించిన సభ్యత్వం కల్పించడం లేదని వారికి ఉన్న రాజకీయ అందదండలతోనే పేద గీత కార్మికులకు సభ్యత్వం రాకుండా అడ్డుకునేందుకు న్నారని పేర్కొన్నారు. ఇకనైనా వెంటనే సభ్యత్వం కల్పించాలని జిల్లా కలెక్టర్, అబ్కారి సూపరింటెండెంట్ ను కోరారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, అబ్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు, అబ్కారి కమిషనర్,రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ కు త్వరలో ఫీర్యాదు చేయడం జరుగుతుందని అన్నారు.పేద గౌడ సభ్యులకు వారం లోపు సభ్యత్వం కల్పించక పొతే కల్లు డిపో ముందు కుటుంబ సభ్యులతో, ప్రజా సంఘాలతో, గౌడ సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగుల నారాయణ గౌడ్, వల్ల కొండా నర్సాగౌడ్, పోడేటి రాజా గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, బుర్ర గడ్డ సంతోష్ గౌడ్, నాగుల క్రిష్ణ గౌడ్, బండి మధుసుధన్ గౌడ్, రమేష్ గౌడ్, పోడేటి సురేష్ గౌడ్ లు పేద గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.