Trending Now

రెండవ పీఆర్సీ ప్రయోజనాలు వర్తింపజేయాలి

పీఆర్‌టీయూ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి

ప్రతిపక్షం, జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 27: గత మార్చి నెల నుండి పదవి విరమణ పొందుతున్నఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండవ పీఆర్సీ ప్రయోజనాలను వర్తింపజేయాలని పీఆర్‌టీయూ (టి .ఎస్) రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కల్లపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జాలి మహేందర్ రెడ్డి పదవి విరమణ అభినందన సభలో జిల్లా అధ్యక్షులు యాల్ల అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని పెల్లి ఆనంద్ రావు లతో కలిసి మహేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జాలి మహేందర్ రెడ్డి పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదక వర్గ సభ్యులుగా ఎంతో సేవ చేశారని.. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పీఆర్‌టీయూ (టీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గా పీఆర్‌టీయూ (టీఎస్) బలోపేతానికి ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. రెండవ పీఆర్సీ ని జులై 1, 2023 నుండి అమలు చేయాలని పీఆర్‌సీ ద్వారా వచ్చే గ్రాటివిటీ పెంపు కమిటేషన్ మార్చి నెల నుండి పదవి విరమణ పొందుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని.. అదేవిధంగా గత పీఆర్సీ లో నష్టపోయిన 2017 టీఆర్టీ ఉపాధ్యాయులకు నాలుగు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి, మండల బాధ్యులు బొమ్మ కంటి శ్రీనివాస్, దన్నపునేని విజయరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News