Trending Now

సురభి మెడికల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్..

15 మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత

ప్రతిపక్షం, సిద్దిపేట, జూలై 05: కోట్లాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు మాత్రం నాసిరకం భోజనం పెడుతూ.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సిద్దిపేట సురభి మెడికల్ కళాశాల యాజమాన్యం. సురభి మెడికల్ కళాశాల పేరుకే మాత్రమే ఎంబీబీఎస్ కళాశాల.. లోపల మాత్రం నాసిరకం భోజనం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతూ కుళ్లిపోయిన కూరగాయలు వండుతూ వైద్య విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చదువుకొని వైద్యం నేర్చుకోవాల్సిన విద్యార్థులు పుడ్ పాయిజన్ తో వైద్యం చేయించుకుంటున్న దుస్థితి సురభి కళాశాల లో నెలకొంది. ఇదొక్కడో కాదు అండి సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజీలో జరిగిన ఘటన. గురువారం రోజున విద్యార్థులకు పెట్టిన భోజనం వల్ల సుమారు 15మంది విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థత కు గురయ్యారు. కళాశాల సిబ్బంది వెంటనే విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇదే విషయమై కొంతమంది మీడియా ప్రతినిధులు విద్యార్థులను ఆరా తీయగా ఆహారం వికటించి ఆరోగ్యం క్షీణించిదని తెలిపారు. మీడియా ప్రతినిధులు హాస్టల్ లో పరిశీలించగా కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతూ, కుళ్లిపోయిన కూరగాయలు, వాడిన వంట నూనె ను తిరిగి మళ్ళీ వాడుతూన్నారు. వంట చేసే సిబ్బంది పరిశుభ్రత పాటించడం లేదు. ఇలాంటి కళాశాల పై అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలు విద్యార్థి సంఘాలు అన్నారు. గతంలో ఈ కళాశాలలో అధికారులు తనిఖీలు చేసేటప్పుడు బయట నుండి రోగులను తీసుకువచ్చే వారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ కళాశాల పై అధికారులు చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూన్నారు.

Spread the love

Related News

Latest News